- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ క్రేజీ హీరో ఉస్తాద్‌ రామ్ పోతినేని ప్రేమలో పడినట్టు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన రామ్ చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు రామ కెరీర్ లో మంచి హిట్లు పడ్డాయి. అయితే గత కొన్ని ఏళ్లు గా రామ్ కు సరైన హిట్లు లేవు. చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత డబుల్‌ ఇస్మార్ట్ సినిమా డిజాస్టర్ అయింది. ఇక రామ్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. యాక్షన్ కు యాక్షన్ .. ఇటు ప్రేమ కథ సినిమాలకు కూడా బాగా సెట్ అవుతాడు. ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా బ్యాచిల‌ర్‌ లైఫ్ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.


తాజాగా రామ్ ఓ అందాల హీరోయిన్ తో ప్రేమలో పడినట్టు ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో ? కాదు రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమా లో అందాలు ఆరబోసిన భాగ్యశ్రీ బోర్సే తో రామ్ డేటింగ్ లో ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో వారి ఇద్దరికే తెలియాలి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. గతంలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వర న్‌ తో కూడా రామ్ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు భాగ్యశ్రీ తో రామ్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా రామ్ త్వ‌ర‌గా బ్యాచిల‌ర్ లైఫ్ న‌కు ఎండ్ కార్డు వేయ‌క పోతే ఈ రూమ‌ర్లు ఇప్ప‌ట్లో ఆగేలా లేవు. ఇక రామ్ కు త్వ‌ర‌గా హిట్ ప‌డితేనే కెరీర్ ట్రాక్ లోకి వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: