- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తో చేస్తున్న కుబేర సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి .  అయితే ఈ సినిమా విడుదలకు ఈ కాస్త సమయం ఉండగానే ఇదే కాంబినేషన్లో మరో సినిమా చేయాల ని నిర్మాత ఆసియన్ సునీల్ ఫిక్స్ అయ్యారు .. ఇక ఈ మేరకు నిన్నటికీ నిన్న ఈ ముగ్గురు సమావేశమై ఒకే కూడా చేసుకున్నారు . ఇక ధనుష్ కూడా వరుస గా తెలుగు సినిమా లు చేస్తున్నారు .. సార్ తర్వాత కుబేర చేస్తున్నారు మళ్ళీ సార్ నిర్మాత నాగ వంశీ తో మరో సినిమాకు ఓకే చేశారు .. కుబేర మూవీ నిర్మాత తో మరో సినిమా కు ఓకే చెప్పారు అంటే మొత్తం నాలుగు తెలుగు సినిమాలు .


ఇదే క్ర‌మంలో కుబేర సినిమా లో ధనుష్ తో పాటు గా నాగార్జున , రష్మిక వంటి వారు కూడా కీలక పాత్ర లో నటిస్తున్నారు .. శేఖర్ కమ్ముల స్టైల్లో చాలా కాలం షూటింగ్ జరుపుకుంటు న్న సినిమా కూడా ఇదే .. మనిషి మీద మనిషి వ్యవహార శైలి మీద జీవన శైలి మీద డబ్బు ప్రభావం ఎలా ఉంటుంది అనే బేసిక్ పాయింట్ మీద వస్తున్న థ్రిల్లింగ్ సినిమా ఇది అని కూడా తెలుస్తుంది .  అలాగే ఈ సినిమా కు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు .  ఇదే క్రమం లో గతంలో ఆసియన్ సినిమాస్ వారు నాగచైతన్య తో శేఖర్ కమ్ముల చేసిన లవ్ స్టోరీ సినిమా ని కూడా వీరే నిర్మించారు .. ఇక‌ మళ్ళీ కుబేర సినిమా తీస్తున్నారు .. ఇప్పుడు మరోసారి ఇంకో సినిమా కు ఓకే చేశారు .. ఈ విధంగా ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ గా మారనుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: