
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే తెలుగు నాట క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో ముందుగా మే 9న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఈ యేడాదే ఓజీ కూడా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఉండొచ్చు. ఇదిలా ఉంటే మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కి అలాగే వారి అభిమాను లకు .. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర లో ఉన్న థియేటర్లకు ఒకోదానికి మంచి అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా క్రాస్ రోడ్స్ లో సంధ్య 70ఎంఎం థియేటర్ అంటే ఎంతో అనుబంధం ఉంది. పవన్ నటించిన చాలా సినిమాలు ఇక్కడ రిలీజ్ అయ్యి సెంచరీలు .. డబుల్ సెంచరీలు కూడా ఆడాయి.
ఈ క్రమంలోనే పవన్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి సినిమా మేనియా అప్పుడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో స్టార్ట్ అయిపోయింది. తాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే ఓజీ మానియా చూడాలి అనుకుంటున్నట్టు ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తోన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్. థమన్ అంటున్నాడు. సుజిత్ దర్శకత్వం లో వస్తోన్న ఈ సినిమా పై హైప్ వేరే లెవల్లో ఉంది. ఈ హైప్ కు తగ్గట్టుగానే థమన్ కూడా నెక్ట్స్ లెవెల్ డ్యూటీ ఈ సినిమా కోసం చేస్తున్నాడట. ఈ క్రమంలోనే పవర్ స్టార్ ఓజి సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నానని .. అందులోనూ మెయిన్ గా సంధ్య 70ఎంఎం దగ్గర మీ అందరి హంగామా చూసేందుకు ఎంతో ఎదురు చూస్తున్నాను అంటూ పవన్ ఫ్యాన్స్ పై ఒక స్కెచ్ డిజైన్ తో పోస్ట్ చేసాడు.