హీరోగా నిర్మాతగ నాని విభిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు. తాను నటించే అలాగే తాను నిర్మించే సినిమాల విషయంలో నాని కథల ఎంపిక చాల ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్లనే ఇంత పోటీ ఉన్నప్పటికీ హీరోగా నిర్మాతగా రాణిస్తున్నాడు. మే నెల మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘హిట్ 3’ మూవీ పై నాని చాల ఆశలు పెట్టుకున్నాడు.



సమ్మర్ సీజన్ మొదలైన తరువాత టాప్ హీరోలు నటించిన సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీనితో ఈ సమ్మర్ సీజన్ విజేతగా నాని మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు ఈసినిమాను నాని చాల ఎక్కువగా ప్రమోట్ చేస్తూ దేశం యావత్తు చుట్టేస్తున్నాడు. వాస్తవానికి ఈసినిమాతో పోటీగా సూర్య ‘రెట్రో’ విదులావుతోంది. అయినప్పటికీ నాని సూర్య పోటీని ఏమాత్రం లెక్కచేయడంలేదు. ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా నాని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేయించిన ‘హిట్ 3’ సెట్ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు అక్కడికే వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకునేలా నాని ఏర్పాట్లు చేశాడు.



రాజమౌళి సినిమల ప్రమోషన్ ను అనుకరిస్తూ ఈ సినిమాలో వాడిన కత్తులు మారణాయుధాలు, పోలీస్ లాకప్, తుపాకీలు, బుల్లెట్లు, ఇంటరాగేషన్ రూములు, జైలు గదులు అన్నీ ఈ సెట్ లో కనిపించే విధంగా నాని ప్రత్యేకమైన శ్రద్ధతో డిజైన్ చేయించాడు. వాస్తవానికి గత కొంతకాలంగా సూర్య వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో నాని మూవీకి ఊహించిన విధంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే నాని కలలు కంటున్న 200 కోట్ల కలక్షన్స్ మార్క్ ను ఈసినిమాతో అందుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.    



దీనితో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈమూవీ పట్ల జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారు అన్న విషయం పై నాని పాన్ ఇండియా ఇమేజ్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: