
ఇక ఇప్పుడూ తన తర్వాత సినిమా కోసం ఆయన రెడీ అవుతున్నట్టు సన్నీ ప్రకటించారు .. ఈ సీనియర్ హీరో కెరీర్ లోనే క్లాసిక్ సినిమా గా నిలిచిన ‘బోర్డర్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే .. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ను దర్శకుడు అనురాగ్ సింగ్ ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కించబోతున్నాడు .. ఈ సినిమా షూటింగ్ లో త్వరలో నే సన్నీడియోల్ అడుగు పెట్టబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు . బాలీవుడ్ ప్రేక్షకుల తో పాటు పాన్ ఇండియా పేక్షకుల కు దగ్గరైన సన్నీ డియోల్ ఇప్పుడు బోర్డర్ 2 మూవీ కోసం రెడీ అవుతుండడం తో ఈ సినిమా లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరి లో పెరిగింది ..
ఇక అప్పటి బోర్డర్ సినిమా లాగా ఈ సిక్వెల్ మూవీ ఎలాంటి సెన్సేషన్ చేసిన క్రియేట్ చేసింద ని అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. ఇక గతంలో వచ్చిన బోర్డర్ మూవీలో సన్నీ డియోల్ , జాకీష్రాఫ్ , సునీల్శెట్టి , అక్షయ్ఖన్నా ప్రధాన పాత్రల్లోనటించిరు . భారత్ – పాకిస్థాన్ 1971 యుద్ధ నేపథ్యం లో 1997 లో విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది . జేపీ దత్తా దర్శకత్వం వహించిన ఈ మూవీ కి అను మాలిక్ , ఆదేశ్ శ్రీవాస్తవ సంగీతం అందించగా.. కేవలం రూ.10 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది .