
టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ప్రస్తుతం మంగుళూరులో వేసిన స్పెషల్ సెట్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా దెబ్బతో ఎన్టీఆర్ ఇండియ న్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయం అంటూ ఎన్టీఆర్ అభిమానులు ధీమాతో ఉన్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టు ను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక రెండు బ్యానర్ల తో పాటు మరో క్రేజీ బ్యానర్ కూడా ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ అవుతున్నట్టు సమాచారం. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కు ఈ బ్యానర్ కూడా బడ్జెట్ కేటాయించనుంది. ప్రతిఫలంగా ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్‌తో పాటు కొంత షేర్ కూడా టి-సిరీస్ తీసుకోనుందట. వచ్చే సమ్మర్ కానుక గా ఈ సినిమా ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కు డ్రాగన్ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీ లిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.