
ఇక అభిమానులు టీజర్, ట్రైలర్ కోసం చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. ఇందులో అనుష్క విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా ఎంతో వైలెన్స్ గా ఉంటుందో ఈ సినిమా అప్డేట్ల విషయం పైన అంతే సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నట్లుగా కూడా చిత్ర బృందం ఇంకా ఎక్కడా కూడా ప్రకటించలేదు.
ప్రస్తుతమైతే అనుష్క ఘాటి సినిమా ల్యాబ్ లోనే ఉన్నదని ఒడిస్సా సరిహద్దులలో షూటింగ్ జరుగుతోందని అక్కడ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగానే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ క్రిష్ అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడుతున్నప్పటికీ కొన్ని కారణాల చేత రిలీజ్ కి మాత్రం ఈ సినిమా నోచుకోవడం లేదనే విధంగా అనుష్క అభిమానులు తెలియజేస్తున్నారు. మరి మొత్తానికి అనుష్క, డైరెక్టర్ క్రిష్ పరిస్థితి ఒకేలాగా కనిపిస్తూ ఉన్నది.. ఘాటి సినిమా విడుదల మీదే వీరికి ఆధారపడింది.