తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును అత్యంత తక్కువ కాలంలో సంపాదించుకున్న నటీమణులలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే కేంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ రానాకు జోడిగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో సంయుక్తా మీనన్ కి మంచి పాత్ర లభించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష సినిమాలు కూడా మంచి విజయాలనీ సాధించడంతో ఈమె క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో చాలా వరకు పెరిగింది.

ఈమె ఆఖరుగా కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన డెవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 మూవీ లో ఈమె నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చింది.

సంయుక్త మీనన్ తాజాగా తనకు మద్యం తాగే అలవాటు ఉన్నట్లు చెప్పింది. కాకపోతే మద్యం రోజు వ్యసనంలా కాకుండా ఏదైనా ఒత్తిడిలో ఉండి మనసు బాధగా ఉంటే కాస్త మద్యం పుచ్చుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఇలా సంయుక్త తనకున్న అలవాటు గురించి చెప్పడంతో చాలా మంది నటీమణులు అంటే ఇలా ఓపెన్ గా ఉండాలి అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: