ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం అయ్యాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో ఆరు సినిమాలు మాత్రం చాలా స్పెషల్.. అందులో మూడు తెలుగు సినిమాలు మాత్రం అసలు మిస్ అవ్వకుండా చూసే సినిమాలు. మరి ఆ సినిమాలు ఏంటో.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల అవ్వనున్నాయో చూద్దాం.

ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో మ్యాడ్ స్క్వేర్ సినిమా, జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్, హావోక్. వీక్ హీరో క్లాస్ 2 సినిమా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ఓటీటీలో నిరమ్ మారుమ్ ఉలిగిల్, జీ5 లో అయ్యన మనే సినిమా రిలీజ్ అయ్యాయి. ఆహాలో యత్తి సాయి సినిమా, మనోరమ మ్యాక్స్ ఓటీటీలో కుమ్మట్టికలి, కల్లం సినిమాలు.. యాపిల్ ప్లస్ టీవి ఓటీటీలో వోండ్లా సినిమా విడుదల అయ్యాయి. వీటిలో మ్యాడ్ స్క్వేర్ సినిమా, యత్తి సాయి, జువెల్ థీఫ్, హవోక్, నిరమ్ మారుమ్ ఉలగిల్, అయ్యన మనే సినిమా తప్పకుండా చూడాల్సినవి. ఇందులో మ్యాడ్ స్క్వేర్ ప్రస్తుతం టాప్ లో ఉంది. ఈ సినిమా ఫుల్ కామెడీ ఉండడంతో ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: