
ఇటీవలే ఈయనకు రాజ్ కుమార్ సంతోషి కటక్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గాయమైంది. ఆ షూటింగ్ లో ఈయన మోకాలికి గాయమైన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత పరేశ్ రావల్ ని ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా.. తాజాగా పరేశ్ రావల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లో కాలికి గాయమైన తర్వాత ఆయన కెరీర్ ఆగిపోతుందని భయపడ్డారట. అయితే ఆ సమయంలో నటుడు అజయ్ దేవగన్ తండ్రి.. వీరూ దేవన్ ఈయనకు ఒక సలహా ఇచ్చారట. గాయం నుండి త్వరగా కోలుకోవాలంటే ఉదయాన్నే తన మూత్రాన్ని తానే తాగాలని సలహా ఇచ్చారట. ఎంతో మంది ఫైటర్లు ఇలానే చేసేవారని అన్నారట. అలా చేయడం ద్వారా ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారట.
అలా చేసేటప్పుడు మద్యం, పొగ త్రాగకూడదని.. మటన్ తినకూడదని వీరూ దేవగన్ తెలిపారని పరేశ్ రావల్ చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత పరేశ్ రావల్ రోజు ఉదయాన్నే తన మూత్రం తానే తాగానని చెప్పారు. అలా ప్రతిరోజూ చేయడం వల్లే తన మోకాలికి తగిలిన గాయం 15 రోజుల్లో మాయమైపోయిందని తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్లు సైతం ఆయన ఎక్స్ రే రిపోర్ట్ చూసి అవాక్కయ్యారంటూ పరేశ్ రావల్ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ గాయం తగ్గడానికి ఇలాంటి పనులు చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు సైతం ఇదేం దిక్కుమాలిన అలవాటు అంటూ విమర్శిస్తున్నాయి.