- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావుది ప్ర‌త్యేక శైలీ. ఇక సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అడవి రాముడు స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. 1977లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా అటు ఎన్టీఆర్ కెరీర్‌కు మాత్ర‌మే కాదు.. ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు కెరీర్ కి చాలా ప్లస్ అయింది. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు ఈ సినిమా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ఈ సినిమా లో ఫ‌స్ట్ శోభన్ బాబును హీరోగా అనుకున్నార‌ట‌. . కానీ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు నటించారని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.


దీనిపై ఇన్నేళ్ల‌కు ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘ మొదట కూడా ఎన్టీఆర్ నే అనుకున్నాం. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం. కాకపోతే, నేను లైన్ గా అనుకున్న సమయంలో శోభన్ బాబు కూడా ఈ క‌థ‌కు బాగా సెట్ అవుతాడ‌ని ఓ ఆప్ష‌న్ గా పెట్టుకున్నాం అని . . అయితే నిర్మాత వ‌చ్చి రామారావు గారి తో సినిమా చేస్తున్నాం. దర్శకుడిగా మీ పేరు చెప్తే ఆయన వెంటనే ఓకే అన్నారు అని చెప్ప‌డంతో వెంటనే నా దగ్గర ఉన్న అడవి రాముడు లైన్ ను డెవలప్ చేశాం అంటూ రాఘవేంద్రరావు చెప్పారు. అడ‌వి రాముడు ఎంత పెద్ద హిట్టో చెప్ప‌క్క‌ర్లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: