టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి హోస్టింగ్ స్టైల్ తో మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ పాపులర్ యాంకర్లలో అనసూయ ముందు వరసలో ఉంటారు. జబర్దస్త్ షో ద్వారా విపరీతంగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఆ షోలో యాంకరింగ్ చేస్తూనే మరోవైపు అనేక షోలలో యాంకర్ గా అవకాశాలను అందుకుంది. అంతేకాకుండా మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. 

ప్రస్తుతం అనసూయ వరుస సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. తనకు సమయం దొరికినప్పుడల్లా తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అనసూయకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా అనసూయ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ అవుతాయి. ఇక అనసూయ రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ షోకి గెస్ట్ గా వచ్చారు. తన భర్తతో కలిసి జోడిగా వచ్చి సందడి చేశారు. ఇద్దరూ కలిసి స్టెప్పులు వేసి కాసేపు అందరితో ముచ్చటించారు.

అందులో భార్య ఎప్పుడూ భర్తకి ఎడమవైపున ఎందుకు ఉంటుంది అని ప్రశ్నించగా దానికి సుశాంక్ భరద్వాజ్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. దానికి అనసూయ కాస్త సీరియస్ అవుతూ ఈరోజు మీరు పిల్లలతో పడుకోండి అని తన భర్తతో చెప్పింది. దీంతో అనసూయ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పలువురు నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. భర్తను బెడ్ రూమ్ లోకి రాకు అని అనడానికి నీకు బుద్ధి ఉందా అని కామెంట్లు చేస్తున్నారు. పదిమందిలో భర్తను అలా అనడం చాలా సిగ్గుచేటుగా ఉందని కొంతమంది అభిమానులు అనసూయపై ఫైర్ అవుతున్నారు. ఈ కామెంట్ల పైన అనసూయ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: