( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్ట‌ర్స్ లో శ్రీ‌విష్ణు ఒక‌రు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఈయ‌న‌ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో కామెడీ చిత్రాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ` సామజవరగమన `, ` ఓం భీమ్ బుష్ `, ` శ్వాగ్ ` వంటి చిత్రాల అనంత‌రం శ్రీ‌విష్ణు నుంచి తాజాగా వ‌చ్చిన మ‌రో కామెడీ ఎంట‌ర్టైన‌ర్ ` సింగిల్ `. కార్తీక్ రాజు తెర‌కెక్కించిన ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిలిచింది.


ఇక‌పోతే సింగిల్ మూవీ ప్ర‌మోష‌న్స్ భాగంగా రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన శ్రీ‌విష్ణు.. సినిమాలంటే త‌న‌కెంత ఇష్ట‌మో వివ‌రిస్తూ త‌న లైఫ్‌లోని ఓ సంఘ‌ట‌న‌ను రివీల్ చేశాడు. చిన్న‌త‌నం నుంచి సినిమాల‌న్నా, క్రికెట్ అన్నా శ్రీ‌విష్ణుకు చాలా ఇష్ట‌మ‌ట‌. ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే రోజుల్లోనే కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లేవాడ‌ట‌. ఆఖ‌రికి ఎంసెట్ ఎగ్జామ్ ముందు రోజు కూడా సినిమాకు వెళ్లాల‌ని ప్లాన్ చేసుకున్నాడట‌.


అయితే బ‌స్ టికెట్ కు డబ్బుల్లేకపోవడంతో ఏకంగా ఎంసెట్ హాల్ టికెట్ తీసుకుని బస్ ఎక్కాడట. హాల్ టికెట్ చూపిస్తే కండక్టర్ టికెట్ కొట్టకుండా వ‌దిలేస్తాడ‌ని ఒక ఫ్రెండ్ చెప్ప‌డంతో ఆ ప‌ని చేశాడ‌ట‌. కానీ, శ్రీ‌విష్ణు ప‌ప్పులు కండ‌క్ట‌ర్ వ‌ద్ద ఉడ‌క‌లేదు. హాట్ టికెట్ చూపించినా కండ‌క్ట‌ర్ టికెట్ డ‌బ్బులు తీయ‌మ‌న‌డంతో.. భంగపడ్డాడు శ్రీ‌విష్ణు. తాజా ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని శ్రీ‌విష్ణు బ‌య‌ట‌పెట్ట‌డంతో.. హీరోగారు ఇటువంటి వేషాలు కూడా వేశారా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నాడు.


కాగా, న‌టుడు కాక ముందు శ్రీ‌విష్ణు క్రికెట‌ర్ గా రాణించాడు. ఆంధ్ర ప్రదేశ్ అండర్ -19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2009లో విడుద‌లైన ` బాణం ` మూవీతో శ్రీ‌విష్ణు వెండితెర‌పై అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత ` సోలో ` మూవీలో యాక్ట్ చేశాడు. అయితే ఈ రెండు చిత్రాల్లో శ్రీ‌విష్ణుకు గుర్తింపు లేని పాత్ర‌లే ద‌క్కాయి. 2017లో రిలీజ్ అయిన ` మా అబ్బాయి ` మూవీతో శ్రీ‌విష్ణు పూర్తి స్థాయి హీరోగా మారాడు. ` మెంటల్ మదిలో `, ` బ్రోచేవారెవరురా ` వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత సోలో హీరోగా శ్రీ‌విష్ణు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.         


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: