ఏంటి అప్పుడెప్పుడో 2012లో విడుదలైన జులాయి సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇష్యూ ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.జులాయి సినిమా విడుదలైన 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా గురించి ఎందుకు వివాదం తలెత్తింది అనేది ఇప్పుడు చూద్దాం.హారిక& హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన జులాయి మూవీకి డైరెక్టర్ గా త్రివిక్రమ్ చేశారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇలియానాలు హీరో హీరోయిన్లుగా చేశారు. అలా 2012లో విడుదలైన ఈ సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది.అలాగే కామెడీ,యాక్షన్,లవ్, ఫ్యామిలీ,ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఈ సినిమాలో అద్భుతంగా ఉండడంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమాలో విలన్ గా సోను సూద్ కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ లు నటించారు.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్ట్ ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో చూస్తే చాలామంది హిందూ సంఘాలు త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు.ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే..జులాయి మూవీలో రాజేంద్రప్రసాద్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తారు. అంతేకాకుండా ఇందులో ఆయన ఎక్కువ భక్తి ఉన్న క్యారెక్టర్ లో నటించారు.అలా రాజేంద్రప్రసాద్ ను చూపించే ముందే ఆయన పూజా గదిలో పూజ చేసుకుంటున్నట్టు వెనుక నుండి చూపిస్తారు. 

అలా రాజేంద్రప్రసాద్ పూజ చేసుకుంటున్న వీడియోని అప్పట్లో ఎవరు పెద్దగా గమనించలేదు. కానీ తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియా ఖాతాలో దీన్ని షేర్ చేయడంతో నెట్టింట్లో వివాదం రాజుకుంది. ఎందుకంటే ఒకే దేవుడి గదిలో అల్లా, జీసస్, హిందూ దేవుళ్లు ఇలా అన్ని మతాలకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. దీంతో చాలామంది హిందూ సంఘాలు త్రివిక్రమ్ పై మండిపడుతూ అసలు నువ్వు మనిషివేనా.. ఓకే దేవుడి రూమ్ లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దేవుళ్ళ ఫొటోస్ పెడతావా.. ఇలా పెట్టాలనే థాట్ నీకు ఎలా వచ్చింది అంటూ ఎంతోమంది హిందువులు త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: