
అయితే ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు ఒక సూపర్ హిట్ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేదాం.. సుందరం గాడి ప్రేమ కథ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. రొమాంటిక్ కామెడీ సినిమాగా రూపొందించిన ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఈటీవీ విన్ లో ప్రసారం అవుతోంది.
ఈ మూవీని డైరెక్టర్ రాంకీ తెరకెక్కించారు. మూవీకి నిర్మాతగా రాఘవేంద్రరావు వ్యవహరించారు. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, లాస్య భావన, శివ నారాయణ ముఖ్యపాత్రలో నటించారు. ఈ మూవీకి జోష్యభట్ల మ్యూజిక్ అందించారు. ఈ మూవీ మిక్స్ట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటినటుల యాక్టింగ్ సహజంగా ఉంది. కానీ సినిమాలో మ్యాటర్ పెద్దగా ఏం లేదు. హాయిగా అన్నీ మర్చిపోయి కాసేపు నవ్వుకోవాలి అనుకుంటే ఈ సినిమాను చూడొచ్చు. ఇకపోతే ప్రస్తుతం నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ మూవీ జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ది డిప్లోమ్యాట్, ది మ్యాచ్, లాస్ట్ బుల్లెట్, నోన్నాస్, బ్యాడ్ ఇన్ ఫ్యూయెన్స్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.