
ఇక ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన నాని ఈ సినిమాలో మాస్ రోల్ లో మళ్లీ కనిపించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ప్రేక్షకులకు హిట్ 3 సినిమాపై పెట్టుకున్న అంచనలకు తగ్గట్టుగా సినిమాను తీశారు. హీరో నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. అలాగే అందాల భామ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ హీరో యష్ హీరోగా నటించారు. కేజీఎఫ్ మూవీ 100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా ఇప్పటికే చాప్టర్, 1 చాప్టర్ 2ని పూర్తి చేసుకుని.. చాప్టర్ 3 పనుల్లో ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీనిధి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
అయితే తాజాగా హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అందులో నాని శ్రీనిధి శెట్టి హుగ్ చేసుకున్నారు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ నాని కౌగిలిలో శ్రీనిధి శెట్టి వాలిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.