ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదిగారు హీరో నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత నటుడిగా మారారు. సరైన ప్లానింగ్, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సెలక్షన్ తో ఇప్పటివరకు కెరీర్ ను అత్యుత్తమంగా బిల్డ్ చేసుకున్నారు. ప్రస్తుతం నటుడుగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు. ఇకపోతే ఇన్నేళ్ల కెరియర్ లో నాని టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరోయిన్లు కూడా చాలామందే ఉన్నారు.


ఈ జాబితాలో మొదట నిత్యా మీనన్ గురించి చెప్పుకోవాలి. నాని హీరోగా తెరకెక్కిన `అలా మొదలైంది` సినిమాతో నిత్యా మీనన్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వ‌చ్చింది.



2015లో నాని హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన `ఎవడే సుబ్రహ్మణ్యం` సినిమా విడుద‌లైంది. ఈ చిత్రంలో అందాల భామ‌ మాళవిక నాయర్‌ కథానాయిక‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.



2016లో `కృష్ణగాడి వీరప్రేమ గాథ` సినిమాతో నాని మరొక హీరోయిన్ ను తెలుగు తెర‌కు పరిచయం చేశారు. ఆమె ఎవరో కాదు మెహ్రీన్ కౌర్‌. అదే ఏడాది నాని నటించిన `జెంటిల్‌మెన్‌` మూవీ విడుదలైంది. ఈ సినిమాతో మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.



2016లోనే నాని `మ‌జ్ను` అంటూ మ‌రో రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌లో వ‌చ్చాడు. ఇందులో అనూ ఇమాన్యుల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ వ‌య్యారికి తెలుగులో మ‌జ్నునే డెబ్యూ కావ‌డం విశేషం. అలా ఒక్క ఏడాదే ముగ్గురు హీరోయిన్ల‌ను టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేశాడు నాని.



2019లో రిలీజ్ అయిన నాని `గ్యాంగ్ లీడర్` సినిమాతో ప్రియాంకా అరుళ్‌ మోహన్ తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో నాని న‌టించిన `జెర్సీ` మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ టాలీవుడ్‌లోకి వ‌చ్చింది.



మ‌ల‌యాళ స్టార్ బ్యూటీ నజ్రియా నజీమ్ కూడా నాని న‌టించిన `అంటే సుందరానికి` సినిమాతోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. ఇక నిర్మాతగా `కోర్టు` మూవీతో శ్రీ‌దేవి అప‌ల్లాని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేశారు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: