ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ,నాగార్జున మ‌న తెలుగు సినిమాకు నాలుగు స్తంభాలుగా చిత్ర పరిశ్రమల దూసుకుపోతున్నారు .  అలాంటిది వీరీలో గతంలో నాగార్జున కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు .. అలా  నాగార్జున శివ సినిమాతో ఆయన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు అప్పటినుంచి ఆయన వరుసగా మాస్ సినిమాలను సైతం చేయగలడు అనే విధంగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు .  అలా వరుసగా అటు ఫ్యామిలీ ఇటు మాస్ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు .  


అయితే నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరిపోరాటం సినిమా భారీ విజయం అందుకుంది .. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా మారుతుందని అంత అనుకున్నారు .. అయితే ఆలోపే చిరంజీవి హీరోగా వచ్చిన యముడికి మొగుడు సినిమా రిలీజ్ అయింది .. ఈ సినిమా కూడా భారీ కలెక్షన్లు అందుకుని లాంగ్ ర‌న్ లో 100 రోజులకు పైగా ఆడటమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది .. ఇలా మెగాస్టార్ చిరంజీవి కారణంగా చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమాను కోల్పోయాడు .. అలాగే 1994 లో కూడా నాగార్జున హీరోగా వచ్చిన హలో బ్రదర్ సినిమా రిలీజ్ అయింది .. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకోవ‌టమే కాకుండా ఇండస్ట్రీ హిట్గా మారుతుంది అన్న స‌మ‌యంలో బాల‌య్య‌ హీరోగా భైరవద్వీపం సినిమా వచ్చి ఈ సినిమాను డామినేట్ చేసి భారీ కలెక్షన్లు అందుకుంది .


ఇలా బాలయ్య భైరవద్వీపం కారణంగా నాగార్జున హలో బ్రదర్ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్గా మారలేకపోయింది .. ఇలా చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరు కలిసి నాగార్జునకు రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందకుండా ఆపేసారని అంటారు .  ఇక ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాడు .  ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ వ‌స్తున్న‌ కూలి సినిమాలో నాగార్జున ఓకీలక పాత్రలో నటిస్తున్నాడు  .  అలాగే ఇక రీసెంట్గా ఈ సినిమా నుంచి నాగార్జున గ్లింప్స్ చూసిన‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు .  అలాగే వీటితోపాటు  ధనుష్ శేఖర్ కమ్ముల‌ దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమాలో కూడా నాగార్జున నటిస్తున్నారు .  ఇక ఈ సినిమాల‌ తర్వాత నాగార్జున తన వందో సినిమాను మొదలపెట్టి ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేయాలని ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: