టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చూస్తున్న విషయం తెలిసిందే .. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అయితే మహేష్ చివరిగా త్రివిక్రమ్ తో చేసిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది .. ఇక దాంతో మహేష్ బాబు , రాజమౌళి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా  పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో భారీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు .. అలాగే మహేష్ తో చేసే మూవీ గ్లోబల్ మూవీ అని కూడా అభిమానులు అంటున్నారు ..


ఇక రాజమౌళి కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాను ప్లాన్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా  కూడా కీలకపాత్రలో నడుస్తుంది .అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ నుంచి ఫోటోలు వీడియోలు  లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఉన్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు .. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా పాన్ ఇండియా లెవెల్ లో బారీ క్రేజ్ తెచ్చుకున్నారు .  అలాగే మహేష్ సినిమాలు థియేటర్స్ లోనే కాదు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి .. కొన్ని సినిమాలు ధియేటర్లో ఆశించిన స్థాయిలో మెప్పించ లేకపోయినా టీవీల్లో మంచి పాపులారిటీ తెచ్చుకుంటాయి .


అయితే మహేష్ బాబు నటించిన ఓ సినిమా బుల్లితెరపై ఏకంగా 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది .. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు 1000 స్సార్లు టెలికాస్ట్ అటమే చాలా కష్టం .. అలాంటిది మహేష్ బాబు సినిమా ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయి కొత్త రికార్డును క్రియేట్ చేసింది .. మహేష్  కెరీర్ లో థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి టీవీల్లో హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి .. అలాంటి సినిమాల్లో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన అతడు , ఖలేజా సినిమాలు థియేటర్స్ లో మెప్పించలేకపోయాయి .. అయితే అతడు సినిమా టీవీల్లో ప్రసారమై కొత్త రికార్డును క్రియేట్ చేసింది .. గతంలో ప్రతి ఆదివారం వచ్చిందంటే చాలు అతడు సినిమా టీవీలో రావాల్సిందే .. అలా స్టార్ మా చానల్లో ఏకంగా ఈ మూవీ 1500 సార్లు ప్రసారమై ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: