గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలనే కాకుండా యావరేజ్ గా ఆడిన చిత్రాలను కూడా రీ రిలీజ్ చేస్తూ ఆయా హీరోల ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తున్నారు. అలా నేడు రీరిలీజ్ అయిన చిత్రం `యమదొంగ`. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయ‌న న‌టించిన య‌మ‌దొంగ సినిమాను రెండు రోజుల ముందు నుంచే థియేటర్స్ లో ప్రదర్శించడం షురూ చేశారు. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తోంది.


ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ యమదొంగలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించబోతున్నాడు. అవును, మీరు విన్నది నిజమే.. మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం `ఖలేజా`. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2010లో విడుదల అయింది. అప్పట్లో కమర్షియల్ గా ఈ సినిమా డిజాస్టర్ అయిన కూడా.. ఆ తర్వాత ఖలేజా కు కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ముఖ్యంగా టెలివిజన్ లో ఖలేజా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఖ‌లేజా వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు.


అంతలా ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది, ఈ నేపథ్యంలోనే ఖలేజాను థియేటర్స్ లో మళ్లీ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. మే 30న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో ఈ సినిమా రీరిలీజ్ కాబోతోంది. అందులో భాగంగానే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా ఓ క్రేజీ న్యూస్ ను రివీల్ చేశారు. ఖ‌లేజాకు సంబంధించి 50 సెకన్ల ఓ మాషప్ వీడియోను ఎన్టీఆర్ నటించిన యమదొంగ రీ-రిలీజ్ కు అటాచ్ చేసి ప్రదర్శిస్తున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్ర‌క‌టించింది. అయితే ఓవర్సీస్ లోని థియేటర్స్ లో మాత్రమే ఈ మాషప్ స్క్రీనింగ్ కాబోతోందని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: