గత కొద్దిరోజులనుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వీరు ఓ కస్టమర్ తో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. దీంతో వీరిపై అనేక రకాల మీమ్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వారు మాట్లాడిన సంభాషణ కారణంగా ఒక్కసారిగా అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ మూత పడింది. అయినప్పటికీ వీరికి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదిలా ఉండగా.... అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ముగ్గురు. 

ఇందులో ఒకరైన రమ్య సడన్ గా ఓ సినిమా ఈవెంట్లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరో అశ్విన్ బాబు నటించిన చిత్రం వచ్చినవాడు గౌతమ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమ్య కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పక్కనే కనిపించి సందడి చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 


ఈవెంట్ లో రమ్య కనిపించిన అనంతరం ప్రతి ఒక్కరూ తనపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి ఏకంగా ఒక్కసారిగా సినిమాల్లో అవకాశాలను కొట్టేసి ఫేమస్ అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా విపరీతంగా మేకప్ వేసుకుందని అంటున్నారు. ఈ విషయం పైన సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ కావడంతో దీనిపై రమ్య స్పందించారు. 


ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ సినిమాలో నటించానని వెల్లడించింది. అంతేకాకుండా తాను సినిమాలలో ఎలాంటి మేకప్ వేసుకోలేదని కేవలం నేచురల్ గానే నటించానని చెప్పింది. ఇదివరకు రెండు సినిమాలలో నటించాను. అందులో కూడా ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ వాడలేదు. కేవలం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడతానని రమ్య అన్నారు. రమ్య షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: