
అయితే తారక్ మాత్రం తన కొడుకులకు ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో మాత్రమే ప్రోత్సహిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆలోచించే హీరోలు చాలా తక్కువమంది ఉంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మరి తారక్ కొడుకులు భవిష్యత్తులో ఏ రంగంపై దృష్టి పెడతారనే చర్చ సోషల్ మీడియా వేదికగా కూడా జరుగుతుండటం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో అదిరిపోయే రోల్ లో కనిపిస్తారని ఈ సినిమాలో తారక్ పాత్ర నిడివి కూడా ఎక్కువేనని తెలుస్తోంది. ఈ సినిమా సౌత్ ఏరియా హక్కులు భారీ మొతానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే వార్2 సినిమాకు 120 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని భోగట్టా. కూలీ సినిమాతో పోటీ ఎదురవుతున్నా వార్2 సినిమాకు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హృతిక్, తారక్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని ఈ సినిమా రిలీజ్ తర్వాత అయాన్ ముఖర్జీ పేరు మారుమ్రోగే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. తారక్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ సంచలన రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.