దాదాపు రెండు దశాబ్దాల నుంచి సినీ పరిశ్రమలో కథానాయికగా సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడిందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. `హ్యాపీడేస్` సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఒక సమయంలో ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ ను కూడా ఏలింది. అగ్ర హీరోలతో తెర పంచుకుంది. ఐటమ్ సాంగ్స్ తోనూ కుర్ర కారుకు కిక్కిచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.


తెలుగు-తమిళ దర్శక, నిర్మాతలు, నటులు తమన్నా వంక కూడా చూడ‌టం లేదు. ఒకప్పుడు దక్షిణాదిలో చేతినిండా చిత్రాలతో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేసిన తమన్నాకు ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనించదగ్గ విషయం. తమిళంలో చివ‌ర‌గా త‌మ‌న్నా చేసిన చిత్రం `అరణ్మనై 4`. ఆ త‌ర్వాత అక్క‌డ ఆమెకు మ‌రో కొత్త ప్రాజెక్ట్ రాలేదు. తెలుగులోనూ అదే ప‌రిస్థితి. ఇటీవ‌ల త‌మ‌న్నా `ఓదెల 2`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హాయ్ చెప్పింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు.


ఇక త‌మ‌న్నా లైన‌ప్ చూస్తే.. ఒక‌ట్రెండు బాలీవుడ్ మూవీస్ మిన‌హా ఒక్క ద‌క్షిణాది ప్రాజెక్ట్ కూడా లేదు. త‌మ‌న్నా క‌న్నా పెద్ద‌వారైన న‌య‌న‌తార‌, త్రిష వంటి తారలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ టాప్ హీరోయిన్లుగా స‌త్తా చాటుతున్నారు. త‌మ‌న్నా మాత్రం సినిమాల్లేక అల్లాడిపోతుంది. ఒకద‌శ‌లో త‌మ‌న్నా బాలీవుడ్ పై మ‌క్కువ పెంచుకోవ‌డమే సౌత్ లో ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డానికి కార‌ణ‌మ‌ని కొంద‌రు అంటున్నారు. అదేవిధంగా బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో ప్రేమాయ‌ణం, రెండేళ్ల‌కే బ్రేక‌ప్ వంటి ప‌రిణామాలు కూడా ఆమె కెరీర్ ను ఎఫెక్ట్ చేశాయ‌ని సినీ ప్రియులు చ‌ర్చించుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: