
ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఒక మెగా హీరో. 2015లో వైవిఎస్ చౌదరి నిర్మించి దర్శకత్వం వహించిన `రేయ్` సినిమా విడుదలైంది. ఇందులో సాయిధరమ్ తేజ్ హీరో కాగా.. సయామి ఖేర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇదే ఆమెకు డెబ్యూ ఫిల్మ్. ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. మరాఠీ, హిందీ భాషల్లోనే సినిమాలు చేసింది. మళ్ళీ వైల్డ్ డాగ్ మూవీతో సయామి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫలితం కూడా ఆమెను నిరాశపరిచింది. ఆ తర్వాత `హైవే` అనే మూవీలో మెరిసిన సయామీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా రాణిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ బబుల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై సయామీ సంచలన వ్యాఖ్యలు చేసింది. `కెరీర్ ఆరంభంలో నాకో చేదు అనుభవం ఎదురయింది. నా 19 ఏళ్ల వయసులో ఒక తెలుగు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఓ లేడీ క్యాస్టింగ్ ఏజెంట్ నాకు ఫోన్ చేసి కాంప్రమైజ్ అయితేనే సినిమాలో ఛాన్స్ వస్తుంది అని చెప్పింది. ఒక మహిళ అయి ఉండి అలా అడగడంతో నేను చాలా షాక్ అయ్యాను. అటువంటి ఆఫర్ తనకు అవసరం లేదని రిజెక్ట్ చేశాను.
ఈ విషయాన్ని అప్పట్లో బయటపెట్టేంత ధైర్యం నాకు లేదు. అందుకే సినిమాను వదిలేసి నా పని నేను చేసుకున్నా. కమిట్మెంట్ లాంటి చేదు అనుభవం కెరీర్ లో ఇంకెప్పుడూ ఎదురుకాలేదు` అంటూ సయామి చెప్పుకొచ్చింది. అయితే పక్కలో పడుకుంటేనే ఆఫర్ ఇస్తా అన్న ఆ తెలుగు డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రం సయామి ఖేర్ రివీల్ చేయలేదు.