సుమంత్ నటించి ఆరు నంది అవార్డులను అందుకున్న ఈ సినిమా చెత్త సినిమా అని రాంగోపాల్ వర్మ ఎందుకు అన్నారు.. రాంగోపాల్ వర్మ ఆ కామెంట్లు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో ప్రేమ కథ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్.ఈ సినిమాకి నాగార్జున ప్రొడ్యూసర్ గా చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది కానీ ఈ సినిమాకి 6 నంది అవార్డులు వచ్చాయి. దాంతో ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాంగోపాల్ వర్మ అసలు ప్రేమ కథ సినిమా ఒక చెత్త సినిమా. అలాంటి ఈ సినిమాకి 6 నంది అవార్డులు ఇచ్చిన వారిని చూస్తే నాకు చాలా జాలి కలగడంతో పాటు నవ్వు కూడా వస్తుంది. 

అసలు ఈ సినిమాలో ఏం చూసి ఆరు నంది అవార్డులు ఇచ్చారో నాకు అర్థం అవ్వడం లేదు. ఇక ప్రేమ కథ సినిమాలో నాకు కనిపించనిది ఏదో వారికి కనిపించే ఉంటుంది. అందుకే ఆరు నంది అవార్డులు ఇచ్చారు.. అంటూ స్వయంగా తాను దర్శకత్వం వహించిన సినిమాపైనే సెటైర్లు వేసుకున్నారు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాలో హీరోగా సుమంత్ హీరోయిన్గా అంతరామాలిని విలన్ పాత్రలో మనోజ్ బాజ్ యి నటించారు. అలాగే కీలక పాత్రల కోసం అన్నపూర్ణ,రాధిక, గిరిబాబు వంటి వాళ్ల ను ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాకి 1999లో ఆరు నంది అవార్డులు వచ్చాయి.ఉత్తమ మూడో తెలుగు సినిమాగా ఆ ఏడాది ప్రేమకథ సినిమాకి నంది అవార్డు వచ్చింది.

అలాగే బెస్ట్ లిరిసిస్టుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కి,  బెస్ట్ డైరెక్టర్ గా ఆర్జీవికి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా వెంకటప్రసాద్ కి, బెస్ట్ మెయిల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పి. రవిశంకర్ కి, బెస్ట్ సపోర్టింగ్ రోల్ గా సీనియర్ నటి రాధిక కి ఇలా ఆరు నంది అవార్డులు వచ్చాయి. దాంతో ఇదో చెత్త సినిమా అని అసలు నంది అవార్డులు ఎందుకు ఇచ్చారో తెలియదు అంటూ ఆర్జీవి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా తర్వాత సుమంత్ ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అలా గోదావరి, సత్యం, గౌరీ,గోల్కొండ హై స్కూల్ వంటి సినిమాలు చేశారు. ఇక రీసెంట్గా అనగనగా అనే సినిమాతో మళ్లీ హిట్ కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: