సినిమా ఇండస్ట్రీ లో అనేక మంది సినిమాను ఏ రేంజ్ లో తీశాం , ఎంత బడ్జెట్ తో తీసాం , సినిమాలో ఎలాంటి హీరోలు నటించారు , ఇవన్నీంటి కంటే కూడా సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేసాం అనేది ముఖ్యం అని అభిప్రాయపడుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం మనం సినిమాను ఎంత గొప్పగా తీసిన దానిని జనాల్లోకి సరిగ్గా తీసుకువెళ్లకపోతే ఆ మూవీ వచ్చింది అని కూడా ప్రేక్షకులకు తెలియదు. దానితో కొన్ని అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన సినిమా ఎంత బాగా తీస్తాడో తీసిన సినిమాను ప్రమోట్ చేయడంలో అంత బాగా వర్క్ చేస్తాడు. ఇక ఈయన తాజాగా దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా అద్భుతంగా ప్రమోట్ చేశాడు.

మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. అనిల్ తన తదుపరి మూవీ ని చిరంజీవి తో చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను అనిల్ మొదలు పెట్టాడు. దానితో ఇది కథ సినిమాను ప్రమోట్ చేయడం అంటూ అనిల్ పై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దాదాపు ఇదే రూట్ లోనే బుచ్చిబాబు సనా కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈయన కూడా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ మూవీ కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్లు ఇస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. దీనితో అనిల్ రూట్ లోనే బుచ్చిబాబు పయనిస్తున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: