సీనియర్ డైరెక్టర్ గా, ప్యాన్ ఇండియా దర్శకుడుగా శంకర్ సృష్టించిన మాయాజాలాలు ఎలాంటివో తెలిసిందే. ఆయ‌న సినిమా అంటే తెర‌పై ఓ క‌ళాఖండం. ఆ విజువ‌ల్స్ చూస్తుంటేనే అత్య‌ధ్భుతం అన్న‌ట్టుగా ఉంటాయి. నాడు కంటెంట్ ప‌రంగాను.. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల‌తో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేయ‌డంలోనూ శంక‌ర్‌కు తిరుగే ఉండేదే కాదు. ఇదంతా గ‌తంగ‌తః.. ఒక‌ప్ప‌టి శంక‌ర్ గురించి చెప్పుకోవాలి. అయితే ఇప్ప‌టి శంక‌ర్ పూర్తిగా గాడి త‌ప్పేశాడు. అప్పుడు ఇప్పుడూ శంక‌ర్ ఫ్లాపులు కంటే.. హిట్లు కంటే ఓ విష‌యం నిర్మాత‌ల‌ను బాగా ఇబ్బంది పెడుతోంది. ఇది శంక‌ర్ తీస్తోన్న డిజాస్ట‌ర్ సినిమాల కంటే పెద్ద ప్ర‌మాదం అని చెప్పాలి.


అదే ఓవ‌ర్ బ‌డ్జెట్‌. శంక‌ర్‌ను బ‌డ్జెట్ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ నిర్మాత కంట్రోల్ చేయ‌లేదు. దీంతో అత‌డి ఇష్టారాజ్యం అయిపోయింది. పైగా చాలా కాస్ట్ లీ మెటీరియల్ అడుగుతూ నిర్మాత‌ల‌ను.. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ల‌కు కూడా శంక‌ర్ చుక్క‌లు చూపిస్తాడ‌ని అంటారు. తాజాగా గేమ్ ఛేంజర్ మూవీకి ఎడిటింగ్ అందించిన షమీర్ మహ్మద్ ఓ మళయాల యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పాడు. ఇవన్నీ ఇన్నేళ్లుగా భరిస్తోన్న నిర్మాతల బాధ చూస్తే చాలామంది జాలి పడతార‌ని అత‌డి మాట‌లు వింటే అర్థ‌మ‌వుతోంది.


గేమ్ ఛేంజ‌ర్ మొత్తం 2.45 గంట‌లు ఉంటే ఈ మూవీకి ఏకంగా ఏడున్న‌ర గంట‌ల ఫుటేజ్ తీశాడ‌ట‌. దానిని 2.45 గంట‌ల‌కు ట్రిమ్ చేయ‌డం అంటే చాలా వేస్ట్ అయ్యింది. అస‌లు మ‌నం చూస్తోన్న ఫుటేజ్ ఇంత గ్రాండియ‌ర్‌గా ఉందంటే... వేస్ట్ అయ్యింది ఇంకెంత గ్రాండియ‌ర్‌గా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అదంతా వృథా ఖర్చు అన్నట్టే .. దీనిని ఎక్క‌డా వాడ‌లేరు. శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కుడు నిర్మాత‌ల‌కు ఇలా గుదిబండ‌గా మార‌కూడ‌దు. మ‌రి శంక‌ర్ ఇప్ప‌ట‌కీ అయినా త‌న‌దైన మార్క్ ఒక్క సినిమాతో ఫామ్‌లోకి వ‌స్తాడేమో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: