
అయితే ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ కూతుర్ల, కొడుకులకు పెట్టిన పేర్లకు సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది. సీనియర్ ఎన్టీఆర్ ఏ పని చేసినా కూడా కాస్త ఆలోచించి చేసే వారిని అలా ఆయన కూతుర్లకు కొడుకులకు కూడా పెట్టిన పేర్లలో కూడా ఒక స్పెషల్ దాగి ఉందన్నట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే ఎన్టీఆర్ తన పిల్లల పేర్లను చివరిలో అబ్బాయిలకు కృష్ణ వచ్చేలా, అమ్మాయిల పేర్లు చివరిలో ఈశ్వరి వచ్చేలా పేర్లను పెట్టుకోవచ్చారు.
రామకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, సీనియర్ జయకృష్ణ, బాలకృష్ణ, మోహనకృష్ణ, జూనియర్ జయకృష్ణ .. వంటి వారి ఎన్టీఆర్ కుమారులు . ఇక వీరందరి చివరిలో కూడా కృష్ణ అనే పేరు ఉండడం గమనార్హం. అలాగే అమ్మాయిల పేర్ల విషయానికి వస్తే భువనేశ్వరి, పురందేశ్వరి, లోకేశ్వరి, ఉమామహేశ్వరి వంటి పేర్లను పెట్టారు. అలా అమ్మాయిలకు చివరిన ఈశ్వరి అని వచ్చేలా చాలా డిఫరెంట్గా పేర్లను ఎంచుకోవడం జరిగింది సీనియర్ ఎన్టీఆర్.. అయితే ఇలా పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే సీనియర్ ఎన్టీఆర్ కు దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేదని ముఖ్యంగా కృష్ణుడు, శివుడు ఎక్కువ భక్తితో పూజించేవారట.అందుకే కృష్ణ అబ్బాయిలకు చివరిలో వచ్చేలా అమ్మాయిలకు ఈశ్వరి వచ్చేలా పేర్లను సెలెక్ట్ చేసుకున్నారు.