
అయితే అప్పటి నుంచి సన్నీ యాదవ్ విదేశాలలో తిరుగుతూ ఉన్నట్లుగా పోలీసులు అధికారులు గుర్తించారు.. పోలీసులు అన్ని ఎయిర్ పోర్ట్లలో కూడా లుక్ అవుట్ నోటీసులను జారీ చేయడంతో గత రెండు నెలల నుంచి సన్నీ యాదవ్ పాకిస్తాన్లోనే ఉన్నారట. అంతేకాకుండా తన టూర్ వీడియోలను బైక్ రైడింగ్ వీడియోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అధికారులు మరింత ఫైర్ అవుతున్నారు. అటు ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తత పరిస్థితులు వేల పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను కూడా పోస్ట్ చేయకూడదంటూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది.
ఈ నిబంధనలను కూడా సన్నీ యాదవ్ అతిక్రమించడంతో కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు. సన్నీ యాదవ్ బైక్ రైడ్ వీడియోలను పాకిస్తాన్ కి సంబంధించి అప్లోడ్ చేయడంతో ఒక నేటిజన్ ఫిర్యాదు ఇవ్వడంతో చెన్నై పోలీసులు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో నేరుగా అతనిని ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి సైతం తీసుకువెళ్లబోతున్నట్లు సమాచారం. సన్నీ యాదవ్ కు సంబంధించి అరెస్టు పైన ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలుపడలేదు. మరి ఈ విషయం పైన అటు కుటుంబ సభ్యులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.