
ముఖ్యంగా థియేటర్లమల్టీప్లెక్స్ లకు సంబంధించి ఈ బంద్ వివాదం పెద్ద ఎత్తున దుమారాన్ని రేపింది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా సినిమా థియేటర్లలో అధిక ధరలకు తిను బండారాలు విక్రయిస్తున్నారని విధంగా వార్తలు వినిపించాయని థియేటర్లు యాజమాన్యం కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించలేదనే విధంగా తెలియడంతో అధికారులు థియేటర్ల పైన తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలలో భారీ ధరలకే థియేటర్లు యాజమాన్యాలు తినుబండారాలను అమ్ముతున్నారనే విధంగా అధికారులు తెలియజేశారు.
తిను బండారాల విషయంపై అధికారులు తనిఖీలు చేస్తున్నారని గుర్తించిన థియేటర్ యాజమాన్యాలు ఆహార పదార్థాలపై 20 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటిస్తే బై వన్ గెట్ వన్ ఆఫర్లతో ప్రకటిస్తున్నారట.. మినీ సైజ్ పాప్కాన్ బకెట్ 750 రూపాయలు అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఇష్టానుసారంగా ఇలాంటి ధరలకు అమ్ముతున్న థియేటర్లకు సైతం అధికారులు నోటీసులు జారీ చేశారు. థియేటర్ లోపల ధరల నియంత్రణ పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా ఉత్తర్వులను జారీ చేశారు. ఇటీవలే విశాఖపట్నంలోని థియేటర్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అధికారులు.. దీంతో ఇప్పుడు అక్కడ థియేటర్లకు వెళ్లే వారికి తినుబండారాల పైన భారీగా బాదుడు తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా కూడా తనిఖీలు ప్రారంభించే అవకాశం ఉందని.. రాబోయే రోజుల్లో అన్ని థియేటర్లలో కూడా అధిక భారం నుంచి ఆడియన్స్ బయటపడతారని చెప్పవచ్చు. మరి పవన్ కళ్యాణ్ దెబ్బకి థియేటర్ల యాజమాన్యం దిగివచ్చి రేట్లను తగ్గిస్తున్నట్లు కనిపిస్తోంది.