యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో మరో పోస్ట్ పెట్టింది. యాంకర్ అనసూయ తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. తన ఫ్యామిలీతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోంది. అనసూయ తన భర్త, కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఫొటోస్ ని షేర్ చేసింది. బికినీ వేసుకొని బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోస్ ని నెటిజన్స్ తో పంచుకుంది.
 
ఆ పోస్ట్ కి శ్రీలంకలోని సింగ్రియా అనే కొండను ఎక్కాను. ఆ మరుసటి రోజు తన కుటుంబంతో ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఫొటోస్ తీసుకున్న అంటూ క్యాప్షన్ ని కూడా జత చేసింది. ఈ బ్యూటీ శ్రీలంక టూర్ డైరీస్ అంటూ ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలని అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ నువ్వు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే ఈ అందాల భామ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తన ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు కూడా పెట్టేసింది.


అనసూయ ఎంతో వైభవంగా సాంప్రదాయాల ప్రకారం పాలు పొంగించి తన ఇంటిలోకి అడుగుపెట్టింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె ఎక్స్ లో పంచుకుంది. ఈమె షోలలో యాంకర్ గా పని చేస్తూనే.. నటిగా కూడా చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. నటి అనసూయ మన్మధుడు, క్షణం, రంగస్థలం, రజకార్, పుష్ప వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: