
యంగ్ హీరో నరేష్ అగస్త్య అప్ కమింగ్ మూవీ మేఘాలు చెప్పిన ప్రేమ కథతో అందరినీ ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్నారు. విపిన్ దర్శకత్వం వహించిన కంటెంట్-రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఇది. ఫస్ట్-లుక్ పోస్టర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు టీజర్ ను లాంచ్ చేశారు. ఈ కథ ఒక ప్రతిభావంతమైన సంగీతకారుడి చుట్టూ తిరుగుతుంది. అతడు ఒక గొప్ప ఆల్బమ్‌కి స్ఫూర్తి పొందేందుకు ప్రశాంతమైన పర్వతప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని కలుస్తాడు. ఈ ఇద్దరి జర్నీ హృదయానికి హత్తుకునే బంధాన్ని తెరపై ఆవిష్కరిస్తాయి. టీజర్ చివర్లో హీరో లేచిపోయిన జంటని చూశావా అని హీరోయిన్ ని సరదాగా అడిగే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
నరేష్ అగస్త్య తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. రబియా ఖతూన్ లైవ్లీగా కనిపించింది రాధికా శరత్‌కుమార్ కథకు బలాన్నీ, వాల్యూని జోడించుతుంది. దర్శకుడు విపిన్ ఒక అందమైన ప్రేమకథను ఎంచుకున్నారు, అద్భుతమైన పర్వతప్రాంతంలోని నేపథ్యంలో సాగుతుంది, అక్కడ సంగీతం ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. సినిమాటోగ్రాఫర్ మోహన కృష్ణ సహజ సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరణ్ మ్యూజిక్ మ్యాజికల్ గా వుంది. డైలాగ్స్ కట్టిపడేస్తున్నాయి. ఆర్ట్ డైరెక్టర్‌గా తొటా తరణి, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేష్ అద్భుతమైన వర్క్ అందించారు. టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ విడుదల కోసం ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు