కొన్ని సినిమాలు చాలా సింపుల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ట్రెండ్ సెట్టర్ లుగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో బొమ్మరిల్లు మూవీ ఒకటి.. అప్పట్లో బొమ్మరిల్లు మూవీ యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది.ఇప్పటికి కూడా ఈ సినిమా యూత్ కి ఫేవరెట్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఒక తండ్రి పిల్లలపై తన ఇష్టాన్ని బలవంతంగా ఎలా రుద్దుతారు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూశాక చాలామంది యూత్ సిద్ధార్థ్ కి అభిమానులు అయిపోయారు. 2006 ఆగస్టు 9న భాస్కర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాతగా  వచ్చిన బొమ్మరిల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది.ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సిద్ధార్థ్ జెనీలియాలు నటించారు.కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, కోటా శ్రీనివాసరావులు కనిపించారు.

 అలా 2026 లో వచ్చి యూత్ ట్రెండ్ సెట్టర్ మూవీగా పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు సినిమాని మొదట డైరెక్టర్ భాస్కర్ వేరే హీరోతో తీయాలి అనుకున్నారట.కానీ ఆ స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేశారట.అయితే అప్పుడు రిజెక్ట్ చేసి ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక సినిమా రిజెక్ట్ చేసి బాధపడ్డారట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ భాస్కర్ మొదట హీరోగా ఎన్టీఆర్ నే అనుకున్నారట.బొమ్మరిల్లు సినిమా స్టోరీ కూడా ఎన్టీఆర్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేసిందట. కానీ అప్పట్లో ఆయనకి ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా సినిమాలోని హీరో క్యారెక్టర్ తనకి సెట్ అవ్వదని, ఈ సినిమాలో ఉన్న హీరో పాత్ర చాలా సింపుల్ గా ఉంటుంది.

 కానీ నా అభిమానులు ఇలా సింపుల్ క్యారెక్టర్ లో ఉండడం ఇష్టపడరు. ఫలితంగా సినిమాకి నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. హిట్ అయ్యే సినిమా నా ఇమేజ్ వల్ల ఫ్లాఫ్ అవుతుంది అని రిజెక్ట్ చేశారట.ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా సిద్ధార్థ్ చేతిల్లోకి వెళ్ళింది.అలా సిద్ధార్థ్ నటించి బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే ఈ సినిమా విడుదలై హిట్ అయ్యాక ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాని నేనే రిజెక్ట్ చేసాను.నా ఇమేజ్ కారణంగానే ఈ సినిమాని వదులుకున్నాను. బొమ్మరిల్లు సినిమా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అలా ఎన్టీఆర్ తన ఇమేజ్ కారణంగా బొమ్మరిల్లు సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: