
కానీ ఒక ఊరికి హీరోయిన్ పేరు ఉండడం ఎప్పుడైనా విన్నారా..? అటువంటి అరుదైన ఘనత త్రిష సొంతం చేసుకుంది. త్రిష పేరుతో ఒక ఊరే ఉంది. తాజాగా ఈ విషయాన్ని త్రిష అభిమానుల్లో ఒక వ్యక్తి రివీల్ చేశాడు. త్రిష పేరుతో ఉన్న ఊరు బోర్డు ముందు నిలబడి వీడియో తీసి సదరు వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది చూసి త్రిష మైండ్ బ్లాక్ అయిపోయింది. తన పేరుతో ఒక ఊరు ఉందన్న సంగతి తొలిసారి తెలియడంతో ఆమె తెగ మురిసిపోయింది. సదరు అభిమాని వీడియోకి లైక్ కొట్టింది.
ఇక ఊరు పూర్తి పేరు `విజయక్ త్రిష`. లడఖ్‌లోని నూబ్రా లోయ నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్ అని పిలువబడే సియాచిన్ బేస్ క్యాంప్‌కు వెళ్లే దారిలో విజయక్ త్రిష ఊరు ఉంటుంది. ఏదేమైనా ఒక హీరోయిన్ పేరు ఊరు ఉండటం అనేది నిజంగా అరుదే. కాగా, త్రిష ప్రస్తుతం `థగ్ లైఫ్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అలాగే మరోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా త్రిష `విశ్వంభర` మూవీలో యాక్ట్ చేస్తోంది. తమిళంలో సూర్య 45లో హీరోయిన్ గా ఎంపిక అయింది. మరియు మలయాళంలో మోహన్ లాల్ తో `రామ్` అనే చిత్రం చేస్తోంది.