కొంతమంది నటీనటులు ఇతర నటీనటులను చూసి భయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేంటంటే శ్రీదేవిని చూసి ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక హీరోయిన్ భయపడిందట. అలా భయపడి దాదాపు 3 రోజుల వరకు తన స్నేహితురాలు ఇంట్లో తలదాచుకుందట.మరి ఇంతకీ శ్రీదేవిని చూసి గడగడలాడిపోయిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.. ఎందుకు స్నేహితురాలు ఇంట్లో తలదాచుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. శ్రీదేవిని చూసి భయపడి ఫ్రెండ్ ఇంట్లో నుండి మూడు రోజుల వరకు బయటకు రాని హీరోయిన్ ఎవరో కాదు రోజా మూవీతో ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన మధుబాల.. మణిరత్నం డైరెక్షన్లో అరవిందస్వామి, మధుబాల కాంబినేషన్లో వచ్చిన రోజా మూవీ ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. 

ఈ సినిమాని ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే,ఇండిపెండెన్స్ డే కి కచ్చితంగా టెలివిజన్లో వేస్తారు. అలా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన రోజా మూవీ ఇప్పటికీ చాలామంది ఫేవరెట్. అయితే ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టారడం సంపాదించిన మధుబాల తమిళ, తెలుగు ఇండస్ట్రీలతో పాటు హిందీలో కూడా రాణించిం.ది అలా హిందీలో మధుబాల ఫూల్ ఔర్ కాంటే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో కలిసి మధుబాల నటించింది. అయితే ఈ మూవీ విడుదల సమయంలో అప్పటికే స్టార్ హీరోయిన్ అయినటువంటి శ్రీదేవి నటించిన లమ్హే మూవీ కూడా విడుదలైందట.

ఇక ఒకేసారి శ్రీదేవి, మధుబాల నటించిన సినిమాలు విడుదలవ్వడంతో ఈ విషయం తెలిసి మధుబాల చాలా భయపడిపోయి దాదాపు మూడు రోజుల వరకు స్నేహితురాలు ఇంట్లో నుండి బయటకు రాలేదట.ఎందుకంటే అప్పటికే స్టార్ హీరోయిన్ అయినటువంటి శ్రీదేవి సినిమా ముందు తన సినిమా ఎలా ఉంటుందోనని ఎంతమంది విమర్శిస్తారో అని భయపడిందట. కానీ ఆ తర్వాత సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హిట్ అయింది అనే విషయం తెలుసుకొని బయటికి వచ్చిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మధుబాల చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: