కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుని కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యి మంచి విజయాలు సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి వెట్రి మారన్ గురించి కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ దర్శకుడికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.

ఇది ఇలా ఉంటే సూర్య హీరో గా వెట్రీ మారన్ దర్శకత్వంలో వడి వసూల్ అనే టైటిల్తో ఓ మూవీ రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. సూర్య హీరోగా వెట్రి మారన్ దర్శకత్వంలో వడి వసూల్ అనే టైటిల్ తో సినిమా చేసే విషయంలో ఈ చిత్రం నిర్మాత వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

దానితో ఇప్పటికే ఈ బ్యానర్ లో ఓ మూవీ చేయడానికి వేట్రి మారన్ కమిట్ అయి ఉండడంతో సూర్య స్థానంలో శింబు హీరోగా తీసుకొని మరో కొత్త కథతో సినిమా చేయాలి అనే ప్రయత్నాలు వెట్రి మారన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా శింబు , కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తగ్ లైఫ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందబోయే మరో మూవీ లో కూడా హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే వెట్రి మారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో ఈయన నటించబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: