మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుండా టాప్ హీరోయిన్ స్థాయిలో కూడా కెరియర్ను చాలా కాలం పాటు కొనసాగించింది. అలా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కంటే కూడా ఇతర భాష సినిమాలో నటించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం తమిళ్ , హిందీ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది.

ఈమె ఆఖరుగా తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ బ్యూటీ మాత్రం ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. నటిగా అద్భుతమైన స్థాయిలో కెరీర్ను కొనసాగిస్తూ భారీ ఎత్తున పారితోషకాలు తీసుకుంటూ ఈ బ్యూటీ బాగానే డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది.

రకుల్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బిజినెస్ రంగం ద్వారా కూడా పెద్ద ఎత్తున డబ్బులను సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె సొంతగా ఇప్పటికే అనేక జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని బిజినెస్ లలోకి కూడా ఈ బ్యూటీ ఎంట్రీ ఇవ్వాలి అని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా రకుల్ కేవలం సినిమాలపై మాత్రమే కాకుండా బిజినెస్ రంగం పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలు మరియు వ్యాపారం రెండింటిపై కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: