ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్ లు ఉన్నా.. కొంతమందికి మాత్రం చాలా చాలా స్పెషల్ రికార్డ్స్ అందుకునే ఛాన్స్ వస్తూ ఉంటుంది.  ఆ లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు . మరి ముఖ్యంగా కాజల్ - తమన్నా- శృతిహాసన్ మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ . ఎందుకంటే..మెగా ఫ్యామిలీలో ఉన్న అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని క్రేజీ రికార్డ్స్ నెలకొల్పారు . అదే విధంగా అక్కినేని ఫ్యామిలీకి కూడా ఒక హీరోయిన్ వెరీ వెరీ స్పెషల్ . ఎంతలా అంటే అక్కినేని ఫ్యాన్స్ లైఫ్ లో మర్చిపోలేనిది.


అక్కినేని నాగార్జునతో ..అక్కినేని నాగచైతన్యతో ..అక్కినేని అఖిల్ తో ముగ్గురితో కలిసి నటించి స్క్రీన్ షేర్ చేసుకొని వావ్ అనిపించింది . తన ఖాతాలో మంచి హిట్స్ వేసుకొని ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. ఆ బ్యూటీ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న "పూజ హెగ్డే". హీరోయిన్ పూజ హెగ్డే పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండింది..? ఇప్పుడు ఎలా ఉంది..? అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . ప్రజెంట్ ఒక హిట్ కొట్టడానికి అల్లాడిపోతుంది ఈ పూజా హెగ్డే .



నాగచైతన్యతో "ఒక లైలా" కోసం అనే సినిమాలో నటించింది . ఈ సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. అక్కినేని  నాగార్జునతో సినిమాలో అయితే స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ యాడ్స్ లో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకుని వావ్ అంటూ మెప్పించింది . నాగ్ - పూజా  కలసి ఎన్నో యాడ్స్ లో నటించారు . ఇలా అక్కినేని ఫ్యామిలీకి మోర్ స్పెషల్ హీరోయిన్గా మారిపోయింది పూజ హెగ్డే . నాగ చైతన్య నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్గా పూజ హెగ్డే అని అంటున్నారు. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ గా ప్రకటన రాలేదు . ప్రస్తుతం పూజ హెగ్డే దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: