
ఏఎస్ రవికుమార్ గురించి . . . ఆయన వ్యక్తిత్వం గురించి టాలీవుడ్ లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఏ ఎస్ రవికుమార్ పఠాన్మరణం టాలీవుడ్లో చాలామందిని తీవ్రంగా బాధించింది. ఎదుటి వ్యక్తితో ఎంతో మంచిగా మాట్లాడటం .. వీలైతే కొంత సహాయం చేద్దాం అన్న నానుడి రవికుమార్ చౌదరికి ఉండేది. డబ్బు .. పదవి .. హోదాతో సంబంధం లేకుండా ఎదుటి వ్యక్తిని గౌరవించడం అనే మంచి లక్షణం ఆయన దగ్గర ఉంది. ఆయనకు ఎవరైనా నచ్చితే అక్కున చేర్చుకుంటారు. ఇష్టం లేకపోతే సింపుల్గా పక్కకు తప్పుకుంటారు.. అంతే తప్ప వారికి చెడు చేయాలని కోరుకునే మనస్తత్వం ఆయనది కాదు అని అందరూ చెబుతూ ఉంటారు.
ఆయన కెరీర్ అయిపోయిందనుకుంటోన్న టైంలో పిల్లా నువ్వులేని జీవితం సూపర్ హిట్ అయ్యింది. తర్వాత గోపీచంద్‌తో సౌఖ్యం ప్లాప్.. చాలా గ్యాప్ తర్వాత రాజ్‌తరుణ్‌తో తీసిన తిరగబడరా సామీ ప్లాప్ అయ్యాక ఆయన కోలుకోలేదు. ఆందోళనతోనే ఆయన చనిపోయారని అంటున్నారు. ఈ సినిమా ఫంక్షన్‌లో ఆయన హీరోయిన్‌కు ముద్దు ఇచ్చినప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి.. అప్పుడు కూతురుకు ముద్దు ఇస్తే తప్పేంటని ఆయన అనడంతో అందరూ ముక్కున వేలేసుకుని ఆయనను అనవసరంగా అపార్థం చేసుకున్నామని బాధపడ్డారు. ఇక ఈ సినిమా టైంలో నే రాజ్‌తరుణ్ - లావణ్య చౌదరి - మాల్వీ మల్హోత్రా వివాదం తెరమీదకు వచ్చింది. అయినా దీనిని తన సినిమా ప్రీ పబ్లిసిటీ కోసం వాడుకోవాలని ఆయన ఏనాడు అనుకోలేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు