
. అయితే అలాంటి బాలయ్య గద్దర్ అవార్డ్స్ వేడుకలో ఓ ఇంపార్ టెంట్ పేరు మర్చిపోయారు.
ఏదో చెప్పబోయి మరేదో చెప్పడానికి ట్రై చేశాడు. దీంతో కొంతమంది బాలయ్యను సరదాగా ట్రోల్ చేస్తున్నారు . సినిమాలో పెద్ద పెద్ద డైలాగ్ ను అవలీలగా చెప్పే బాలయ్య ఒక ఇంపార్టెంట్ వ్యక్తి పేరు మర్చిపోయారా..? అంటూ జనాలు ట్రోల్ కూడా చేస్తున్నారు . దీంతో బాలయ్య స్టేజిపై మాట్లాడిన వీడియోని ట్రెండ్ చేస్తున్నారు . నిన్న గద్దర్ అవార్డు వేడుక ఈవెంట్లో బాలయ్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే అవార్డు అందుకున్న తర్వాత బాలయ్య స్టేజి స్పీచ్ ఇస్తూ తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరు మర్చిపోయారు .
దానిని కవర్ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు . ఆ విషయం వీడియోలో క్లియర్గా అర్థం అయిపోతుంది . దీనితో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది . బట్టి విక్రమార్క పేరు మర్చిపోయిన బాలయ్య ఆర్థిక విద్యుత్ మంత్రి.. డిప్యూటీ సీఎం అంటూ చాలా చాలా గ్యాప్ తీసుకున్నాడు ..మల్లు అంటూ మళ్ళీ గ్యాప్ తీసుకున్నాడు.. పూర్తి పేరుని పలకడానికి తడబడ్డాడు.. చాలాసేపు నీలు నమ్ములుకున్నారు .. ఆ తర్వాత పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందించడంతో బట్టి పేరుని స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ గా మారింది . అయితే గతంలో పుష్ప2 సక్సెస్ ఈవెంట్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు . ఆ కారణంగానే ఆయనని అరెస్ట్ చేయించాడు అంటూ హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది . ఇప్పుడు మన బాలయ్య కూడా ఆ పేరు మర్చిపోయాడు. బాలయ్య ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు మరి ఏం చేస్తారో..? అంటూ ఫన్నీ ఫన్నీగా మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయ్..!