పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ క‌లిసి నిర్మిస్తున్నారు. యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. సాక్షి వైద్య సెకండ్ హీరోయిన్ గా క‌నిపించ‌నుంది. రెండేళ్ల క్రితం ప‌వ‌న్ టేక‌ప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆయ‌న పాలిటిక్స్‌లో బిజీగా ఉండ‌టంతో.. ఉస్తాద్ షూటింగ్ డిలే అవుతూ వ‌చ్చింది.


అయితే రీసెంట్‌గా మేక‌ర్స్ ఈ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లారు. హైద‌రాబాద్ లో షూటింగ్ జెట్ స్పూడ్ లో సాగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, శ్రీ‌లీల‌పై హ‌రీష్ శంక‌ర్ ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇక‌పోతే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఢీ కొట్టే విల‌న్ ఎవ‌ర‌న్న‌ది ఇంత‌కాలం బ‌ట‌య‌కు రాలేదు. ఇప్పుడా స‌స్పెన్స్ వీడింది.
తమిళ స్టార్ నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ ను ఈ చిత్రంలో విల‌న్ క్యారెక్ట‌ర్ కోసం లాక్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌తో మూవీ టీమ్ సంప్ర‌దింపులు జ‌రప‌డం.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆయ‌న‌కు లుక్ టెస్ట్ కూడా జ‌రిగిపోయాయ‌ట‌. త్వ‌ర‌లోనే పార్థిబన్ షూటింగ్ లో జాయిన్ కానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో హ‌రీష్ శంక‌ర్ సెల‌క్ష‌న్ అదుర్స్ అని.. ప‌వ‌ర్ స్టార్ కు విల‌న్ గా పార్థిబన్ స‌రిగ్గా స‌రిపోతాడ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, పార్థిబన్ తెలుగులో చివ‌రిగా రామ్ చ‌ర‌ణ్ `ర‌చ్చ‌`లో న‌టించారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ప‌వ‌న్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: