ఎంత పెద్ద హీరో అయినా సరే కొన్ని కొన్ని రోల్స్ లో  నటించడానికి ఇష్టపడరు . కొందరు భయం కారణంగా అలాంటి రోల్స్  చూస్ చేసుకోరు..  మరి కొందరికి అలాంటి రోల్స్ తెచ్చిపెట్టే డైరెక్టర్ లు దొరకరు.  మరీ ముఖ్యంగా ఇప్పుడు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కోరిక నెరవేరాలి అంటే మహేష్ బాబు ఆ పాత్రలో కచ్చితంగా నటించాలి అంటూ చెపుతున్నారు పరచూరి గోఫాల కృష్ణ.  ఎందుకు పరుచూరి  అలా అన్నారు..? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అది అందరికీ తెలుసు.  ప్రజెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా తర్వాత ఆయన రేంజ్ అన్నీ కూడా మారిపోతాయి పెరిగిపోతాయి.  అయితే ఇలాంటి మూమెంట్లోనే పరుచూరి గోపాలకృష్ణ - మహేష్ బాబు పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . మహేష్ బాబుకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా ఒక పాత్ర ఉంది అని.. అది కచ్చితంగా మహేష్ బాబు రేంజ్ ని మార్చేస్తుంది అని తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎప్పటినుంచో అలాంటి పాత్రలో మహేష్ బాబుని చూడాలి అని ఆశపడ్డారు అన్న విషయాన్ని బయటపెట్టారు .



సీతారామరాజు పాత్రలో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించి మెప్పించారు . ఆ పాత్రలో కృష్ణని తప్పిస్తే ఇక ఎవరు కూడా గొప్పగా నటించలేరు.  అందులో డౌటే లేదు . అల్లూరి పాత్రలో నటించాలి అనే కోరిక కృష్ణ గారికి ఆ చిత్రంతోనే నెరవేరింది . సూపర్ స్టార్ కృష్ణ కోరుకున్న పాత్రలో నటించలేకపోయారు . ఆ పాత్ర మరేంటో కాదు చత్రపతి శివాజీ మహారాజ్ . చత్రపతి శివాజీ పాత్రలో  నటించి అని కృష్ణ గారు ఎప్పటి నుంచి అనుకున్నారు.  కానీ ఆ కోరిక నెరవేరలేదు సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా మహేష్ బాబుకి ఆ అవకాశం ఉంది .



తండ్రి కోరికను మహేష్ బాబు నెరవేర్చాలి అంటే ఎప్పటికైనా సరే శివాజీ ఛత్రపతి పాత్రలో నటించాలి.  మహేష్ బాబు ..శివాజీ పాత్రలో నటిస్తే ప్రపంచం మొత్తం దాసోహం అయ్యే అవకాశం ఉంది . అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే అంశాలు శివాజీ పాత్రలో ఉంటాయి . అభిమానులు కూడా మహేష్ బాబుని ఈ పాత్రలో చూడడానికి వెయిట్ చేస్తున్నారు అంటూ పరుచూరి  గోపాలకృష్ణ తెలిపారు . దీంతో సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్స్  వైరల్ గా మారాయి. చూద్దాం మరి మహేష్ బాబుకి అలాంటి క్యారెక్టర్ రాసే డైరెక్టర్ ఎక్కడున్నాడో ..? ఆ ఛాన్స్ ఎవరికిస్తాడో మహేష్ బాబు..??

మరింత సమాచారం తెలుసుకోండి: