
కానీ గత రెండేళ్లలో త్రిష నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ఫ్లాపులను మూటగట్టుకుంది. 2023లో `ది రోడ్`, `లియో` చిత్రాలతో త్రిష ప్రేక్షకులను పలకరించింది. ది రోడ్ లేడీ ఓరియంటెడ్ మూవీ కాగా.. లియోలో దళపతి విజయ్ హీరోగా యాక్ట్ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. 2024లో విజయ్ తో `గోట్` మూవీలో మరోసారి జత కొట్టింది త్రిష. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఈ ఏడాది `ఐడెంటిటీ`, `విడుముయార్చి`, `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రాలతో త్రిష వచ్చింది. ఈ సినిమాలేమి ఆశించిన స్థాయిలో ఆడలేదు. వరుసగా ఆరు ఫ్లాపులతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి అతి చెత్త రికార్డును త్రిష నమోదు చేసింది. పోని రీసెంట్ గా రిలీజ్ అయిన `థగ్ లైఫ్`తోనైనా త్రిష సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో అనుకుంటే అదీ జరగలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన థగ్ లైఫ్ డిజాస్టర్‌గా నిలిచింది. పైగా ఈ మూవీలో నటించినందుకు త్రిష విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇక త్రిష ఖాతాలో వరుస ఫ్లాపులు పడుతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారట.
ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్న బిగ్ ప్రాజెక్ట్స్ లో `విశ్వంభర` ఒకటి. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే త్రిష పరాజయాల పర్వం ఎక్కడ విశ్వంభరతో కూడా కొనసాగుతుందో అని మెగా ఫాన్స్ భయపడుతున్నారట.