
కెరియర్ మొదట్లో అసిస్టెంట్ ఎడిటర్ గా ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా.. ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే పాన్ ఇండియా డైరెక్టర్గా ఆయన ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర సీరియల్స్ ని డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు అంటే ఆయన కమిట్మెంట్ ఆయన పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణమని చెప్పాలి. రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడు అనేది అందరికీ తెలుసు . అది ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయన షూటింగ్లో పాల్గొంటే ఖచ్చితంగా మెడలో ఐడి కార్డ్ వేయాల్సిందే.
షూటింగ్ కి టైం కి రావాల్సిందే. ఎనిమిదిన్నరంటే ఎనిమిదిన్నరకి అక్కడ ఉండాల్సిందే . లేకపోతే రాజమౌళికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ లా నిల్చో పెట్టి అడిగి కడిగేస్తాడు . ఇదే విధంగా ఓ నటుడిని అడిగి కడిగేసాడు. అయితే ఆ నటుడు ఇచ్చిన ఆన్సర్ రాజమౌళికి అస్సలు నచ్చలేదు . కౌంటర్ లా అనిపించిందట. వెటకారంగా మాట్లాడడంతో మండిపోయిన రాజమౌళి ఇక ఆయనతో సినిమాలను చేయడమే మానేశాడు . ఆయన మరెవరో కాదు "ప్రకాష్ రాజ్ ".
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో ప్రకాష్ రాజ్ చేసే పాత్రలు చాలా చాలా బాగుంటాయి. ఇంకా పక్కాగా చెప్పాలి అంటే రాజమౌళినే ప్రకాష్ రాజ్ కి లైఫ్ ఇచ్చాడు అని చాలామంది అంటూ ఉంటారు . రాజమౌళి డైరెక్షన్లో రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమాలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సీన్స్ ఎప్పటికీ మర్చిపోలేము . ప్రకాష్ రాజ్ లో ఇంత మంచి నటుడు ఉన్నాడు అన్న విషయాన్ని బయట పెట్టింది రాజమౌళినే. అయితే సినిమా షూటింగ్ కి రాజమౌళి సరిగ్గా సమయానికి వచ్చేస్తాడు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం అలా కాదట . సినిమాకి లేటుగా షూటింగ్ కి వస్తూ ఉంటాడట. ఇదే మూమెంట్లో ఒకసారి ప్రశ్నించగా సెటైరికల్ గా ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పడంతో అప్పటినుంచి రాజమౌళి ఆయనని దూరం పెట్టాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చాలా వైల్డ్ యాంగిల్ కూడా రాజమౌళి లో ఉంది అంటూ ప్రకాష్ రాజ్ మేటర్ లోనే బయటపడింది . సోషల్ మీడియాలో మరొకసారి ఇదే న్యూస్ ని బాగా వైరల్ చేస్తున్నారు అభిమానులు . చాలా చాలా సైలెంట్ గా ఉండే రాజమౌళి ఆయన ముందు తోక జాడిస్తే మాత్రం కట్ చేసి పక్కన పట్టేస్తాడు . సినిమా నుంచి తీసి అవతల కొట్టేస్తాడు . దానికి దీ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ అని అంటూ మాట్లాడుకుంటున్నారు..!!