రష్మిక మందన్నా ఫస్ట్ లవ్ అనగానే అందరూ ఆమె మొదట ఎంగేజ్మెంట్ చేసుకున్న రక్షిత్ శెట్టినో లేక విజయ్ దేవరకొండనో అనుకుంటారు. కానీ ఇద్దరు కాదట.రష్మిక మందన్నా ఫస్ట్ లవ్ వేరే ఉన్నారట. మరి ఇంతకీ రష్మిక మందన్నా మొదట ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు తన ప్రేమ బ్రేకప్ అయ్యింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రష్మిక మందన్నా రీసెంట్ గా ధనుష్ కుబేర మూవీతో హిట్ కొట్టింది. ఈ హీరోయిన్ ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రష్మిక మందన్నా పేరు పాన్ ఇండియా లెవెల్ లో మార్మోగిపోతుంది. అలా పుష్ప-2, ఛావా,యానిమల్, తాజాగా కుబేర.. ఏ సినిమాలో నటించినా సరే రష్మిక మందన్నాకి అదృష్టమే కలిసి వస్తుంది. కానీ సల్మాన్ ఖాన్ తో నటించిన సికిందర్ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి.. 

ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా రష్మిక మందన్నా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఆ టైంలో మీ ఫస్ట్ లవ్ ఎవరు అని రష్మికకు ప్రశ్న ఎదురవుగా అందరూ రక్షిత్ శెట్టినో, లేక విజయ్ దేవరకొండ పేరునో చెబుతుందని అనుకున్నారు. కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా అనూహ్యంగా తన ఫస్ట్ లవ్ స్కూల్ డేస్ లోనే అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.అంతేకాదు మీకు మొట్టమొదటి లవ్ లెటర్ ఎక్కడ వచ్చింది అని అడగగా..అది కూడా స్కూల్ డేస్ లోనే అంటూ రష్మిక మందన్నా ఆన్సర్ ఇచ్చింది. దీంతో చాలా మంది నెటిజెన్లు ఇన్ని రోజులు రష్మిక మందన్నా ఫస్ట్ లవ్ రక్షిత్ శెట్టినో లేక విజయ్ దేవరకొండనో అనుకుంటున్నాము. కానీ వీళ్ళు ఎవరు కాదు..  

స్కూల్ డేస్ లోనే రష్మిక మందన్నా కి లవ్ స్టోరీ ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్గా పాల్గొన్న ప్రెస్ మీట్ లో రష్మిక మందన్నాకి తన మొదటి బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కూడా ఎందుకు బ్రేకప్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అనే విషయం గురించి అడుగుతారు కావచ్చు ఆన్సర్ చెబుతామని చాలా ఆసక్తిగా ఎదురుచూసింది.కానీ రక్షిత శెట్టి గురించి ఎక్కడ కూడా ప్రశ్న అడగలేదు.. అయితే గత కొద్ది రోజులుగా రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉంది. సమయం దొరికినప్పుడల్లా రహస్యంగా వెకేషన్ లకు వెళుతూ ఉంటారు. కానీ ఏదైనా ఈవెంట్లో ఈ విషయం గురించి అడిగితే మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ తమ మధ్య ఉన్న రిలేషన్ ని కప్పిపుచ్చుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: