
అయితే ఈ క్రమంలో విమల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు .. ఇందులో ఆయన కాపీరైట్ ఉల్లంఘనను గుర్తించి హిట్ 3 చిత్రానికి సంబంధించిన హక్కులు విక్రయాన్ని నిలిపేయాలని సినిమా వలన వచ్చిన లాభాల్లో 20% నష్టపరిహారంగా తనకు చెల్లించాలని లేదా పూర్తిగా లాభాల అకౌంటింగ్ రిపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాడు .. అయితే విమల్ వాదనపై న్యాయమూర్తి సెంథిల్ కుమార్ రామమూర్తి స్పందించి .. జులై 7 2025 లోపు సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు .. అలాగే ఈ కేసును తదుపరి విచారణకు వాయిదా వేశారు .. అలాగే ఈ కేసు అత్యవసరమైనది అని పేర్కొంటూ Commercial Courts Act సెక్షన్ 12A ప్రకారం మధ్యవర్తిత్వం నుంచి మినహాయింపు కూడా కోరారు .. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్పై చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది . ఇక మరి ఈ కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు