- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాను తెర‌కెక్కుతోన్న అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య వరుసగా అఖండ - వీర సింహారెడ్డి - భగవంత్‌ కేసరి - డాకూ మహారాజ్‌ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ నాలుగు సినిమాలు టైటిల్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. బాలయ్య కెరీర్లు ఎన్నో పవర్ఫుల్ సినిమాలతో టైటిల్స్ తో సినిమాలు చేసి సూపర్ హిట్ లు కొట్టారు. బాలయ్య ప్లాప్ అయిన సినిమాలు కూడా పవర్ఫుల్ టైటిల్స్ ఉన్నాయి. సమరసింహారెడ్డి - చెన్నకేశవరెడ్డి - నరసింహనాయుడు - లక్ష్మీ నరసింహ - పలనాటి బ్రహ్మనాయుడు - సీమ సింహం - బొబ్బిలి సింహం .. ఇలా బాలయ్య నటించిన ఎన్నో సినిమాలుకు టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.


తాజాగా తనకు తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న దామోదర్ రాజనర్సింహ పేరుతో ఒక సినిమా చేయలేని ఉందని బాలయ్య అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం హైదరాబాదులో ఆదివారం ఘనంగా జరిగింది. గవర్నర్ జిష్ణు దేవ్ శ‌ర్మ - మంత్రి దామోదర్ రాజనర్సింహ - బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే దామోదర్ రాజనర్సింహ పేరుతో ఒక సినిమా చేయలేని ఉందన్న ఆకాంక్ష బాల‌య్య వ్యక్తం చేశారు. ఇక తాను డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలన్న ఆశతోనో ఈ ఆసుపత్రి ప్రారంభించలేదని .. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఆకాంక్షతోనే ఆసుపత్రి ప్రారంభించినట్లు బాలయ్య చెప్పారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: