సాధారణంగా ప్రతి ఒక్క అభిమానికి తమ ఫేవరెట్ హీరోని హీరోయిన్ లేదా యాక్టర్ ని కలవాలని ఉంటుంది.  వాళ్ళతో సెల్ఫీ దిగాలని వాళ్ళతో మాట్లాడాలని..  వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని అందరికీ ఉంటుంది.  కొంతమందికి అదృష్టం దక్కుతుంది . మరి కొంతమందికి అలాంటి ఛాన్స్ రాకపోవచ్చు . ఎక్కడైనా స్టార్స్  కనిపిస్తే ఫోటోల కోసం ఆటోగ్రాఫ్ల కోసం ఎలా ఎగబడిపోతూ ఉంటారో ఫ్యాన్స్ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మాత్రం ఫాన్స్ రకరకాల పద్ధతులను ఎంచుకుంటున్నారు . తమ ఫేవరెట్ హీరోని కలవడానికి సైకిల్ యాత్ర చేయడం.. నడుచుకుంటూ వెళ్లడం..  రిస్కీ పనులు చేయడం లాంటివి చేస్తున్నారు . ఇలా చేసి స్టార్స్ ని కలిసిన అభిమానులు ఎంతో మంది.


అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అభిమాని మాత్రం వేరే లెవెల్ . మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ఈ వీరాభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి దర్శనం కావాలి అంటూ ఒక మెగా వీరాభిమాని ఏకంగా నిరాహార దీక్షకు దిగాడు.  దీంతో ఇది సంచలనంగా మారింది . ఈ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.  ఉమ్మడి అనంతపురం జిల్లా జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయినిపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తికి చిరంజీవి అంటే చాలా చాలా ఇష్టం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయనను అభిమానిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాడు.



ఒక విధంగా చెప్పాలి అంటే చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ ..వీరాభిమాని . దీంతో ఆయన అభిమాన హీరోని కలిసేందుకు అనేకసార్లు ప్రయత్నించారు . కానీ ఏది కూడా కుదరలేదు.  దీంతో విసుగెత్తిపోయిన ఆ అభిమాని చిరంజీవిని ఎలాగైనా కలిసేందుకు ఏకంగా నిరాహార దీక్షని మార్గంగా ఎంచుకున్నాడు . అనుకున్నదే వెంటనే నిరాహార దీక్ష  చేసేసాడు.  దీంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది . ఇంతకీ రామకృష్ణ ఎందుకు చిరంజీవిని కలవాలనుకుంటున్నాడో తెలుసా..?? ఆయన దగ్గర ఒక జానపద కథ ఉందట.  అది చిరంజీవికి వినిపించాలి అంటూ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాడట.  కానీ కుదరలేదు అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు రామకృష్ణ . ఇది మెగాస్టార్ చిరంజీవికి రీచ్ అయ్యి అభిమానిని కలుస్తాడో..?? లేదో..?? చూడాలి. కాని సోషల్ మీడియాలో కొంత మంది మాత్రం రామకృష్ణ పై నెగిటివ్గా స్పందిస్తున్నారు . ఇలాంటివి చేస్తే ఆయనేం రాడు నీ హెల్త్ జాగ్రత్త అంటూ సజెస్ట్ ఇస్తున్నారు. మరికొందరు చిరంజీవి గారు త్వరగా రెస్పాండ్ అవ్వండి అంటూ ఈ వార్తలకు సంబంధించిన లింకులను షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: