
ఎన్టీఆర్ యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులకు గట్టి పోటీ ఏర్పడింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారట. కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు వార్ 2 తెలుగు థియేటర్ రైట్స్ ను కనీసం 100 కోట్లకు విక్రయించారని భావిస్తున్నారట. లేకుంటే సొంత రిలీజ్ చేసుకుంటామని చెబుతున్నారట.
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల డబ్బింగ్ రైట్స్ 70 కోట్ల వరకు పలుకుతున్నాయి. అయితే ఆ రేటుకు విక్రయించేందుకు మేకర్స్ ముందుకు రావడం లేదని.. అందువల్ల వార 2 బిజినెస్ ఇంకా ఆన్ లోనే ఉందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా తెలుగు రైట్స్ ను నాగ వంశీకి దక్కేనా? లేక యష్ రాజ్ ఫిల్మ్స్ వారు సొంతంగానే సినిమాను రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి. కాగా, ఎన్టీఆర్ బాలీవుడ్ లో నేరుగా చేస్తున్న తొలి చిత్రమిది. ఇటీవల బయటకు వచ్చిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు