
టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా ఎప్పటినుంచో తన కెరీర్ లో ఒక సాలిడ్ సూపర్ డూపర్ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. జిన్నా తర్వాత మంచు విష్ణు నుంచి వచ్చిన భారీ సినిమా కన్నప్ప. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మంచు విష్ణు కథ , కథనాలతో వచ్చిన ఈ సినిమా విష్ణు కెరీర్ లోనే భారీ హిట్ సినిమా గా వెళుతోంది. నిన్న ప్రపంచ వ్యాప్తంగా పలు భారతీయ భాషలలో పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ అయిన కన్నప్ప విష్ణు కెరీర్ లోనే రికార్డ్ ఓపెనింగ్ సందుకున్నట్టుగా టాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్ లు చెబుతున్నాయి. తాజాగా వచ్చిన పిఆర్ లెక్కల ప్రకారం కన్నప్ప సినిమా తొలి రోజు ఏకంగా రు. 20 కోట్ల ఓపెనింగ్స్ కొల్ల గొట్టినట్టు తెలుస్తోంది.
మంచి విష్ణు కంబ్యాక్ తన కెరీర్ లో ఒక రికార్డు బ్రేకింగ్ కం బ్యాక్‌గా నిలిచింది అని చెప్పాలి. ఈ వసూళ్లు మంచు విష్ణు కెరీర్ లోనే ఆల్ టైం హయ్యస్ట్ రికార్డుగా నిలిచాయి. ప్రస్తుతం రెండో రోజు శనివారం , మూడో రోజు ఆదివారం కూడా సాలిడ్ బుకింగ్స్ కన్నప్ప చూపిస్తోంది. దీంతో ఫస్ట్ వీకెండ్ కు వచ్చేసరికి కన్నప్ప భారీ వసూళ్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ పాత్ర ఈ సినిమాను ఇండియా వైడ్‌గా ఎంతో మంది ప్రేక్షకులకు కనెక్ట్ చేసింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు